500 రూపాయలకే అందించాలని, వినియోగదారులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శీలం స్వామి మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో దాదాపు 18,000 పై చిలుకు మంది వినియోగదారులుంటే దాదాపు 7000 మందికి మాత్రమే ఈ 500 రూపాయల పథకం వర్తిస్తుందని మిగతా 11,000 మందికి ఇప్పటివరకు పథకం వర్తించడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రానున్న మాసం రోజుల్లో వినియోగదారులందరికీ ఈ పథకం వర్తింపచేయాలని, లేనిపక్షంలో మహిళా సోదరీమణులతో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కంచం నర్సింలు, కోడె శ్రీనివాస్, పల్లె సత్యం గౌడ్, సుంచు గణేష్, వంగూరి దిలీప్, రాజు మహిళా వినియోగదారులు పాల్గొన్నారు.
ఎంపీడీ ఓ కార్యాలయంలో వినతి పత్రం అందించిన బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి ఆధ్వర్యంలో
Date: