నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
అమ్మ తెలంగాణ న్యూస్ తేదీ/24/6/ప్రతినిధి ఏర్పుల రాజు..ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలని ఎం ఆర్ సి సిబ్బందికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాకేష్ మాట్లాడుతూ విద్యపై వ్యాపారం చేస్తూ, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలలో పాఠ్యపుస్తకాలు, బెల్టులు, డ్రెస్సులు, టైలు అమ్ముతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.