మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు ఆవాస్తవం

Date:

బలహీన వర్గాల మంత్రిపై ఆరోపణలు చేయడం సరికాదు, దమ్ముంటే ఆధారాలతో నిరూపించండి…ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి

ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్

         సమాజంలో బడుగు బలహీన వర్గాల నాయకులు ఎదుగుతుంటే బీఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేక, అనేక కుట్రలు చేస్తున్నారని ముస్తాబాద్ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రామగుండం నుండి తరలించబడుతున్న ఫ్లై యాష్ లారీల్లో ఓవర్ లోడ్ తో వెళ్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని నిరాధార ఆరోపణలు చేస్తూ పొన్నం ప్రభాకర్ పరువుకు భంగం కలిగిస్తున్నాడని మండిపడ్డారు.మానుకోట మీద తెలంగాణ వాదులపై రాళ్లు వేసిన చరిత్ర నీదైతే, తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పేప్పెర్ స్ప్రే దాడి.

తెలంగాణ బిల్లు పాస్ కావడంలో తనదైన పాత్ర పోషించారని కొనియాడారు. రామగుండం ఎన్టిపిసి లో ఉత్పత్తి అయిన ఫ్లై యాష్, బాటమ్ యాష్ 100% ఇతర ప్రజా వినియోగ అవసరాల కోసం బయటకి తరలించడానికి కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిని టెండర్ల ద్వారా ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది దీని తరలింపు ఎన్టిపిసి మాత్రమే చూసుకుంటుంది.

గత బీ.ఆర్.ఎస్ పాలనలో జరిగిన అక్రమ ఇసుక తరలింపు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం, ఇసుక మాఫియాను అరికట్టడంలో విఫలమైన సంబంధిత శాఖలు గోదావరి రివర్ మేనేజ్మెంట్ కు 25 కోట్ల రూపాయలు చెల్లించాలని మూడు శాఖలకు జరిమానా విధించిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఈ తీర్పు అనంతరం నియోజకవర్గంలో ఇసుక తరలింపు నిలిపి వేయడంతో అవినీతి సొమ్ముకు అలవాటు పడిన కౌశిక్ రెడ్డి, అక్రమ ఆదాయం ఆగిపోవడంతో అక్కసుతో, ప్రజాధనాన్ని కాపాడాలని సమర్ధవంతమైన పరిపాలన నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వారిపైన బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే కౌశిక్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఫ్లైయాష్ ఓవర్ లోడ్ విషయంలో ఎన్టిపిసి మార్గదర్శకాల మేరకే లారీలలో తరలిస్తున్నామని, అలాంటి నువ్వు మా బడుగు బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ పైన గాని, కాంగ్రెస్ ప్రభుత్వం పైన గాని నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, తగిన రీతిలో ప్రజాక్షేత్రంలో నీకు తగిన బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు.
కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాల మేరకే ఫ్లైయాష్ తరలింపు జరుగుతుందని ఇలాంటి అవినీతికి ఆస్కారం లేదని తెలియజేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పిసిసి మహేష్ గౌడ్ కలిసిన రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి అమ్మ తెలంగాణ...

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బంగారు తారాబాయి పదవి విరమణ సన్మానం

పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం నుండి పంచలంచెలుగా పదోన్నతి పొంది...

నిరుపేదకు మెరుగైన వైద్యం కోసం రెండు లక్షల 50 వేలు ఎల్ఓసి అందించిన కాంగ్రెస్ నాయకులు

ఇదే నిజం ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎండి గౌస్ అనారోగ్యంతో...

ప్రేమ జంట యువతీ యువకుడు ఆత్మహత్య

        ఇదే నిజం ముస్తాబాద్ మండలం గూడెం...