రామాలయంలో ఘనంగా డోలోత్సవం..మండల కేంద్రంలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో సోమవారం డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. హోలీ పర్వదినం పురస్కరించుకొని ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊయలలో ఊపుతూ అర్చకులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.