రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తా బాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన పెంటం చందు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతారో ఏమో అని కరీంనగర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముస్తా బాద్ ఎస్.ఐ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అదే సమయంలో అర్థ రాత్రి పూట ఇదే మండలం రామ లక్ష్మణ పల్లె తో పాటు మరో గ్రామానికి చెందిన అయిదు ట్రాక్టర్లు ఇసుక ను నింపుకొని ముస్తా బాద్ వెళ్ళే క్రమంలో అక్కడ పోలీస్ బందోబస్తు ఉన్న బ్లూ కోర్టు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అయిదు ఇసుక ట్రాక్టర్ లు బ్లూ కోర్టు కానిస్టేబుల్ సత్యనారాయణ కు తారసపడగా ఈ విషయం పికేటింగ్ లో అక్కడే ఉన్న ముస్తాబాద్ ఎస్. ఐ కి సమాచారం ఇవ్వగా ట్రాక్టర్ల వద్దకు వచ్చిన ఎస్. ఐ బ్లూ కోర్టు కానిస్టేబుల్ సత్యనారాయణ ను రామ లక్ష్మణ పల్లె కు చెందిన ఓ ఇసుక ట్రాక్టర్ పై ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తీసుకు రావాలని చెప్పినట్లు సమాచారం. ఎస్ ఐ ఆదేశాల మేరకు సదరు కానిస్టేబుల్ ట్రాక్టర్ పై కుర్చోగా ట్రాక్టర్ డ్రైవర్ఉ ద్దేశపూర్వకంగా కానిస్టేబుల్ తో సహా ట్రాక్టర్ ను నామాపుర్ చెరువులో తోసి వేశాడు. దీంతో సత్యనారాయణ అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కాగ అతడిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తరలించిన పోలీసులు.
వీధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఇసుక మాఫియా దాడి
Date: