వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో మరమ్మత్తు పనులు చేయించాలి.
అమ్మ ఆదర్శ పాఠశాల అమలుపై కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్ష.
—————————————-
సిరిసిల్ల, ఏప్రిల్ 2, 2024:
—————————————-
వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని ఆయా పాఠశాలల్లో మరమ్మతు పనులు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
అమ్మ ఆదర్శ పాఠశాల అమలు, కమిటీల ఏర్పాటు, పనులు చేయించే విధానంపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయములోని సమావేశ మందిరంలో నీటి పారుదల, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ, ప్యాకేజీ-9 ఈఈలు, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తో కలిసి కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు. జిల్లాలో మొత్తం 510 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 309 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల అమలు చేయడం జరిగిందని తెలిపారు. హెచ్ ఎమ్, మహిళా సంఘాలలోని సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ కమిటీ ఆద్వర్యంలో స్కూల్ లలో తాగునీరు, తరగతి గదుల్లో చిన్న చిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తదితర సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. ఆ కమిటీల ఆధ్వర్యంలో అన్ని మరమ్మతు పనులు చేయించాలని ఆదేశించారు. జాతీయ బ్యాంక్ లలో ఖాతాలు ఓపెన్ చేయాలని కలెక్టర్ సూచించారు.
సమీక్షలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథ్, డీఈఓ రమేష్ కుమార్, పీఆర్ ఈఈ సూర్య ప్రకాష్, డీఆర్డీఓ శేషాద్రి, ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.