కాంగ్రెస్ పార్టీలో చేరికపై బీఆర్ఎస్ నాయకులు నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముస్తాబాద్ పట్టణాధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై ఎంతో నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ వారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు.వ్యక్తిగత లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు.ఒక పార్టీ గెలిచి మరొక పార్టీలో చేరడం పార్టీ ఫిరాయింపులు సరి కాదని మండిపడ్డారు.ప్రజలు తప్పకుండా గుణపాఠం చెపుతారని ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో కొమ్ము బాలయ్య,భరత్,మల్లేశం మనోహర్,మల్లేష్ యాదవ్, స్వామి,నవీన్,నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.