రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నేవాని పల్లే గ్రామపంచాయతీ పరిధిలోని నిమ్మలవాని పల్లే గ్రామానికి చెందిన నిమ్మల ప్రభాకర్ గత 2 నెలల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించాడు .బీఆర్ఎస్ సభ్యత్వం ఉండడంతో కార్యకర్త కుటుంబానికి పార్టీ తరపున రూ.2 లక్షల ప్రమాద భీమా చెక్కు మృతుని కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకులు అందించారు.
కష్టకాలంలో మా కుటుంబానికి సహాయం అందించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ,ఎమ్మెల్యే కేటీఆర్ కు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సురేందర్ రావు , మాజీ ఏఎంసీ చైర్మన్లు అక్కరాజు శ్రీనివాస్,బత్తుల అంజయ్య, పార్టీ సీనియర్ నాయకులు చీటీ వేంకట నర్సింగ రావు, చిప్పలపల్లి మాజీ సర్పంచ్ గాడిచర్ల దేవయ్య ,గ్రామశాఖ అధ్యక్షుడు గుంటుకు శ్రీకాంత్ , మాజీ ఉప సర్పంచ్ నిమ్మల విష్ణు,పోతుగల్ ప్యాక్స్ డైరెక్టర్ గన్నే నర్సింలు , పోతుగల్ గ్రామ శాఖ అధ్యక్షుడు రేపాక బాల్ నర్స్ ,మాజీ వార్డు మెంబర్ గన్నే సుమన్,గన్నేవాని పల్లే యూత్ అధ్యక్షుడు దేవేందర్,గ్రామ శాఖ ఉప అధ్యక్షుడు నిమ్మల సతీష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.