బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బాధ నరేష్
ముస్తాబాద్ మండలం తో పాటు చీకోడు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని బాధ నరేష్ డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకం ద్వారా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ లు అందించడంలో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలకు కట్టిస్తామన్న హామీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాధ నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆరులైన వారందరినీ కలుపుకొని వారికి న్యాయం జరిగేంతవరకు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.